Header Banner

ప్రపంచ బ్యాంక్ నివేదికతో వైకాపా కుట్ర మాస్క్ తొలిగింది..! బూటకపు ఫిర్యాదులపై క్లారిటీ!

  Tue Apr 15, 2025 09:06        Politics

రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న వైకాపా కుట్రలు వీగిపోయాయి. ఆ పార్టీ అనుకూలురు పంపిన ఫిర్యాదులు ఒట్టి బూటకమని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి సమాచారమిచ్చినట్లు తెలిసింది. అన్నీ సంతృప్తికరంగా ఉండడంతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అమరావతికి మొదటి విడత రుణం కూడా విడుదల చేశాయి. దీనికి కేంద్రం వాటా కలిపి రూ.4,285 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అంతలోనే రంగంలోకి దిగిన వైకాపా నాయకత్వం.. గతేడాది డిసెంబరు 17న ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదు పంపింది. దేశ, విదేశాల్లోని రకరకాల సంస్థలు, వ్యక్తుల పేరుతోనూ అమరావతిలో అనర్థం జరిగిపోతోందన్నట్లుగా మెయిల్స్ పంపించారు. రాజధానికి భూసమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలకు ఉపాధి పోయిందని, వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయన్నది వారి అభియోగం. రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తుతాయన్నారు.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!


పర్యావరణం, జీవావరణంపైనా ప్రభావం పడుతుందని, పంట భూములు తీసుకోవడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందంటూ అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు రూపొందించి పంపించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రయత్నించగా, ఇలాగే తప్పుడు ఫిర్యాదులు పంపించింది. ప్రభావితం చేసేందుకు తీవ్ర యత్నాలు వైకాపా పంపించిన తాజా ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానల్ను ఏర్పాటు చేసింది. ఆ తనిఖీ బృందం ఇటీవల రాజధానిలో రెండు దఫాలుగా పర్యటించింది. విజయవాడలో ఈ బృందం మకాం వేసిన హోటల్కు వైకాపా అనుకూలురు పలుమార్లు వెళ్లి, వారిని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలేవీ లేవని నిర్ధరణకు వచ్చింది. ఆ మేరకు ప్రపంచ బ్యాంకుకు నివేదించింది. సంతృప్తి చెందిన ప్రపంచ బ్యాంకు.. ఆ ఫిర్యాదును డ్రాప్ చేసి, అమరావతికి రుణం మంజూరు చేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #WorldBankReport #YSRCPConspiracy #FakeAllegationsExposed #APPolitics #TruthRevealed